తిరుమల వసంత మండపంలో అచ్యుతార్చన, గోపూజను తితిదే వైభవంగా నిర్వహించింది. కార్తిక మాసంలో తితిదే తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా ఈ రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి మేళతాళాల నడుమ తీసుకు వచ్చారు. అక్కడ విష్ణుపూజా సంకల్పంతో పాటు... ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన నిర్వహించి కపిల గోవుకు, దూడకు ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతి, నైవేద్యాలను సమర్పించి, గోప్రదక్షిణ చేశారు
ఇదీ చదవండీ...