నవరత్నాలను అమలు చేయడమే జగన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని... ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయలను రుణంగా అందజేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు.
ఇవీ చదవండి...'22 మంది ఎంపీలను గెలిపిస్తే...బడ్జెట్లో తెచ్చిందేమిటి'