తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను ఇవాళ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో నిర్ణయం తీసుకుంది. తితిదే సభ్యుడిగా రెండుసార్లకు మించి అవకాశం ఇవ్వకూడదనే నిబంధన ఇద్దరికి మినహాయింపు ఇచ్చింది. దేవదాయ చట్టంలోని 19 కె సెక్షన్నుంచి.. సుధానారాయణమూర్తి (ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి), శ్రీనివాసన్ (ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్)కు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు మరో మూడేళ్లపాటు తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా కొనసాగనున్నారు.
ఇదీ చదవండి