తిరుమల సన్నిధి గొల్ల పద్మనాభ యాదవ్ గుండె పోటుతో మృతి చెందారు. గదిలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన ఆయనను అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. యాదవ కులానికి చెందిన పద్మనాభం... వంశపారంపర్యంగా సన్నిధి గొల్లగా పనిచేస్తున్నారు. ఆచారం మేరకు ప్రతిరోజూ దివిటీ పట్టుకుని అర్చకులను ఆలయానికి తీసుకురావడం.. ఆలయ తలపులు తెరవడం.. మూయడం వంటివి ఈ సన్నిధి గొల్లలే చేయడం సాంప్రదాయంగా కొనసాగుతోంది.
ఇవీ చూడండి : జైలులో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణకు ప్రాణహాని: వర్ల రామయ్య