చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామివారు బంగారు తాపడంతో మెరిసిపోయారు. భక్తుల వితరణలతో స్వామివారికి ఈ తాపడం చేయించినట్లు తెలిపారు.ఈ తాపడానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి మాధవ రెడ్డి అల్లుడు విజయ్ రెడ్డి రూ.35 లక్షల అందజేశారు. తాపడం అలంకరణతో ఆలయంలోని శ్రీగురు దక్షిణామూర్తి స్వర్ణ కాంతులతో విరాజల్లుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఇదీ చదవండి : TTD: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన తితిదే