ETV Bharat / state

తిరుమల శ్రీవారికి గోదాదేవి పూలమాలల అలంకరణ - తిరుమల వార్తలు

తిరుమల శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని గోదామాలలను శ్రీవారి మూలవిరాట్‌కు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి తిరుమాడవీధుల్లో ఊరేగింపుగా పూలమాలలు ఆలయానికి చేరుకున్నాయి.

godadevi-garland-decoration
గోదాదేవి పూలమాలల అలంకరణ
author img

By

Published : Jan 15, 2021, 4:00 PM IST

తిరుమల శ్రీవారికి గోదాదేవి పూలమాలలను అలంకరించారు. శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని గోదామాలలను శ్రీవారి మూలవిరాట్‌కు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి పెద్ద జీయర్​‌ మఠానికి పూలమాలలు చేరుకున్నాయి. అక్కడినుంచి మంగళవాయిధ్యాల నడుమ తిరుమాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి మూలవిరాట్​కు అలంకరించారు.

ఇదీ చదవండి: 21న తిరుపతిలో జనసేన కీలక సమావేశం... పాల్గొననున్న పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.