చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పెన్నలపాడులో ఊయల మెడకు బిగుసుకుని బాలిక మృతి చెందింది. గ్రామానికి చెందిన జానకి ఊయల ఊగుతుండగా పొరపాటున అది మెడకు బిగుసుకుంది. దాంతో ఊపిరాడక చిన్నారి మరణించింది. పాప మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి.. భార్యను తీవ్రంగా హింసించి... ఇంట్లోనే వదిలేసి!