పూల మొక్కల చాటున గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పాకాల సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని ఏ.రంగంపేట పరిసరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో సెబ్ పోలీసులు సోదాలు చేశారు. గ్రామానికి చెందిన కొట్టె వెంకటరమణ యాదవ్ పూల తోటలో అక్కడక్కడా సుమారు 6 అడుగుల ఎత్తు పెరిగిన 11గంజాయి మొక్కలను గుర్తించి తొలగించారు. సుమారు 10 కిలోలున్న గంజాయిని సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు.. పాకాల సెబ్ సీఐ లీలారాణి తెలిపారు.
ఇదీ చదవండి: అప్పుల బాధతో తండ్రి...కూల్ డ్రింక్ అనుకొని కుమారుడు...