.
తిరుమలలో ఉచిత లడ్డు విధానం నేటి నుంచి అమలు
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించాలన్న ప్రతిపాదనను నేటి నుంచి అమలులోకి తెస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి రూ.40 విలువైన 175 గ్రాముల లడ్డూ ఉచితంగా అందిస్తామన్నారు. వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశం, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే భక్తులకు సైతం ఇదే వర్తిస్తుంది’ అని వివరించారు. అదనంగా కావాల్సిన వారు రూ. 50 ఇచ్చి కొనుక్కోవాలి.
నేటి నుంచి శ్రీవారి లడ్డు ప్రతి భక్తుడికి ఉచితం
.