ETV Bharat / state

అనిశా వలలో అటవీ అధికారులు

చిత్తూరు జిల్లా సత్యవేడులో.. ఇద్దరు అటవీ అధికారులు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. బ్యాంక్​లో చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1.03 కోట్లను విడుదల చేసేందుకు అవసరమైన ఎన్ఓసి తీసుకునేందుకు.. కాంట్రాక్టర్ అధికారులను సంప్రదించగా.. వారు రూ.5లక్షలు లంచం డిమాండ్ చేశారు.

forest officials caught to acb
forest officials caught to acb
author img

By

Published : May 8, 2021, 11:48 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఫారెస్ట్ డెవల్​ప్​మెంట్ కార్పొరేషన్ కార్యాలయానికి చెందిన డివిజనల్ మేనేజర్ పిచ్చయ్య, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దిలీప్​ లు.. రూ.1.50 వేలు లంచం తీసుకుంటూ అనిశా వలలో చిక్కుకున్నారు. ఆయుర్వేదం, మెడిసిన్ ఇతర అవసరాలకు వినియోగించే యూకలిప్టస్ చెట్లను ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్.. ఇ -టెండర్ నిర్వహించింది. 14 వేల టన్నులు చెట్లను ఓ కాంట్రాక్టర్ రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్ కింద టెండర్ మొత్తంలో 25 శాతం అంటే రూ.1.03 కోట్లు చెల్లించారు. అంతకు ముందు 10 శాతం డిపాజిట్​ను టెండర్ వేసేందుకు చెల్లించారు. చెట్లు కొనుగోలు, తరలింపు నిబంధనల మేరకు జరిగింది.

బ్యాంక్​లో చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1.03 కోట్లను విడుదల చేసేందుకు అవసరమైన ఎన్ఓసి తీసుకునేందుకు.. కాంట్రాక్టర్ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో అధికారులు రూ.5 లక్షలు నగదు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని కాంట్రాక్టర్ రూ.4.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మొదటి విడతగా రూ.1.50 లక్ష నగదు ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు అల్లాబక్షు, జనార్దన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

'డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.