చిత్తూరు జిల్లా పుత్తూరు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు... బ్యాంకుల ద్వారా రుణ మంజూరు కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పుత్తూరు మున్సిపాలిటీలో స్వయం సహాయ సంఘాలకు సంబంధించి 29 కోట్లు వచ్చే నాలుగేళ్లలో రుణమాఫీ చేయనున్నట్లు రోజా తెలిపారు. అదేవిధంగా సంఘ సభ్యులకు సైతం ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో వ్యాపారాల కోసం స్థలాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి-కోనసీమ అందాలు బాగున్నాయి: దిగ్విజయ్‌సింగ్