Flexi Destroyed in Puttur: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైకాపాలో వివాదాలు తారాస్థాయికి చేరుకుంది. ఈనెల 21న సీఎం జగన్ జన్మదినం వేడుకలను పురస్కరించుకొని పుత్తూరు పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది చూసి ఓర్వలేక గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే వాటిని ధ్వంసం చేశారు.
Internal crash in Nagari Constituency YSRCP: అయితే దీనికి నిరసనగా రోజా ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే రోజానే ధ్వంసం చేయించిందని ఆరోపించారు. రోజా దౌర్జన్యాలను అరికట్టాలనే నినాదాలతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి... : Bridges Damaged: వంతెన.. ‘రక్షణ’పై ఆందోళన!