ETV Bharat / state

అదుపుతప్పి కారు బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 14, 2020, 8:31 PM IST

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీర సముద్రం వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురికి గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ఓ మహిళ చెందినట్లు స్థానికులు తెలిపారు.

five persons injured in a road accident ksheera samudram
అదుపుతప్పి కారు బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు

దీపావళి పర్వదినాన శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న భక్తుల కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం కారులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శ్రీరంగరాజపురం మండలం క్షీర సముద్రం వద్ద తొమ్మిది మందితో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికిపైగా గాయపడ్డారు.

స్థానికులు కారులో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్లలో లావణ్య అనే మహిళ పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

అనుమానంతో భార్యను చంపిన భర్త..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.