IND vs BAN First Test Yashasvi Jaiswal : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించి బౌలింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టారు. వరుసగా టాప్ ఆర్డర్ వికెట్లను పడగొట్టారు. కానీ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను మాత్రం పడగట్టలేకపోయారు. ఆ తర్వాత కూడా అశ్విన్, జడేజాల అసాధారణ ఇన్నింగ్స్‌లతో భారత్ మంచి స్కోర్ దిశగా ముందుకు వెళ్లింది.
అయితే ఈ పోరులో యశస్వి జైస్వాల్ ఓ చారిత్రాత్మక రికార్డును సాధించాడు. బంగ్లా టఫ్ బౌలింగ్‌లో 56 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి 10 ఇన్నింగ్స్‌లలో 750 కన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 1935లో 747 పరుగులతో వెస్టిండీస్‌కు చెందిన జార్జ్ హెడ్లీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు దాన్ని జైశ్వాల్ బ్రేక్ చేశాడు.
స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసింది వీరే
755* - యశస్వి జైస్వాల్ (భారతదేశం)
747 - జార్జ్ హెడ్లీ (వెస్టిండీస్)
743 - జావేద్ మియాందాద్ (పాకిస్థాన్)
687 - డేవ్ హౌటన్ (జింబాబ్వే)
680 - సర్ వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)
IND vs BAN Hasan Mahmud : కాగా, ఈ పోరులో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహముద్ నాలుగు వికెట్లతో భారత్‌ను గట్టిగా దెబ్బకొట్టాడు. రోహిత్, గిల్, కోహ్లీ, పంత్ లాంటి టాప్ ప్లేయర్ల వికెట్లను వరుసగా కూల్చాడు. ఈ నలుగురిలో పంత్ తప్ప మిగితా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పంత్ మాత్రం 52 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ - జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
సూపర్ సెంచరీతో ధోనీ రికార్డ్ సమం - ఆ విషయంలో తలా కంటే అశ్విన్ ఎక్కువే! - Ashwin Test Record
అశ్విన్, జడ్డు 'ది సేవియర్స్'- దెబ్బకు 24ఏళ్ల రికార్డు బ్రేక్ - Ind vs Ban Test Series 2024