తిరుపతిలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా తిరుపతి తూర్పు, అలిపిరి ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాలు, కారు టైర్ల చోరీలు జరుగుతున్నాయన్నారు.
పోలీసుల నిఘా..
పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు తిరుపతికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠా ఈ దొంగతనాలకు పాల్పడుతుందని గుర్తించారు.
నగరానికి చెందిన అహ్మద్, నరేష్, చాణుక్య, గౌరీశంకర్ సహా మరో బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మూడు ద్విచక్రవాహనాలు, కారు టైర్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.