చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థరించారు. బాధితుడు చెన్నై నుంచి శ్రీకాళహస్తి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలతో ఈనెల 20న తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితుడు చేరాడు. రాష్ట్రంలో మెుత్తం కరోనా కేసులు 8కి చేరాయి.
ఇదీచదవండి