ETV Bharat / state

అడవుల్లో నిప్పు... నివారించకుంటే తప్పదు పెను ముప్పు

author img

By

Published : Mar 25, 2021, 7:49 PM IST

మానవ మనుగడకు అడవులు ఎంతో కీలకం. అడవుల నుంచి లబ్ధి పొందుతూ మానవులు ఆనంద జీవితాన్ని గడుపుతున్నారు. మరో వైపు ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల కారణంగా ఏటా కొన్ని వేల ఎకరాల్లో అడవులు కాలిపోతున్నాయి. రాష్ట్రంలోని కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని అడవుల్లో అగ్గి రాజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

fire accident in sheshachalam forest in kadapa, chithore districts
కడప జిల్లాలో తగలబడుతున్న అడవి

ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం కలిగిన విశాలమైన అటవీ ప్రాంతం కడప జిల్లాలో ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని గండి ప్రాంతం నుంచి మొదలైన పాలకొండలు... వీరబల్లి మండలంలోని గడికోట వద్ద శేషాచలం అడవులలో కలుస్తాయి. అక్కడి నుంచి ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, సుండుపల్లి, పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాలలను అనుసంధానం చేస్తూ చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది.

రాలిన ఆకులతో ప్రమాదం...

ఈ విశాలమైన అటవీ ప్రాంతంలో ఏటా వేసవి మొదలు కాగానే ఎండల తీవ్రతకు గ్రాసం ఎండిపోయి, చెట్ల ఆకులు రాలిపోతాయి. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని అటవీ ప్రాంతంలోని వృక్ష సంపద అగ్నికి ఆహుతవుతోంది. చెట్లతో పాటు పక్షులు, జంతువులు, క్రిమి, కీటకాలు మంటల్లో కాలిపోయి వాటి మనుగడ కనుమరుగవుతోంది.

కడప జిల్లాలో తగలబడుతున్న అడవి

అవగాహనతో నివారణ...

తత్ఫలితంగా అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అడవిలో నిప్పు పెడితే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తే ఈ ముప్పును కొంతవరకైనా అరికట్టవచ్చని అటవీ సంరక్షణ అధికారులు భావిస్తున్నారు.

ఇదీచదవండి.

డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.