ETV Bharat / state

వైఎస్సార్సీపీ సర్పంచ్​ భర్త నిర్వాకం - అధికారం అండతో అడ్డగోలుగా దోపిడీ - YSRCP Sarpanch Husband extortion

YSRCP Sarpanch Husband People Misappropriation of Funds in Eluru District : గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సాగించిన నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఏలూరు జిల్లా ఓ పంచాయతీలో ప్రభుత్వ అధికారిని అడ్డం పెట్టుకుని సర్పంచ్‌ భర్త దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఓ సామాజిక కార్యకర్త ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

YSRCP SARPANCH HUSBAND EXTORTION
YSRCP SARPANCH HUSBAND EXTORTION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 8:40 AM IST

YSRCP Sarpanch Husband People Misappropriation of Funds in Eluru District : ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని బొర్రంపాలెం గ్రామ మేజర్‌ పంచాయతీలో సుమారు 7 వేల మంది జనాభా ఉన్నారు. ఈ పంచాయతీకి వైఎస్సార్సీపీ బలపరిచిన కలపర్తి వెంకటేశ్వరమ్మ సర్పంచిగా ఎన్నికయ్యారు. భార్య హోదాని అడ్డుపెట్టుకుని మునేశ్వరరావు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాజిక కార్యకర్త పాండురంగ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అక్రమాలకు సంబంధించి పలు విషయాలు వెలుగుచూశాయి.

2021 నుంచి 2024 వరకు వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన రూ. 14 లక్షల ఖజానాకి జమ చేయనట్లు తెలిసింది. పలుచోట్ల చేతి పంపుల నిర్వహణ పేరుతో లక్షల్లో బిల్లులు పెట్టి స్వాహా చేసినట్లు తేలింది. గ్రామం నడిబొడ్డు నుంచి చివరి వరకు ఉన్న చెత్త డంపింగ్‌ యార్డు వరకూ కచ్చా డ్రైన్‌ సహా గ్రావెల్‌ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో చూపి నిధులు దోచేశారు.

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

పంచాయతీకి చెందిన తాగునీటి ట్యాంకు స్థలాన్ని స్థానిక గుత్తేదారు కబ్జా చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీఎల్​పీఓ కారు అద్దె పేరుతో రూ. 12 వేల చొప్పున నెలనెలా పంచాయతీ ఖాతా నుంచి చెల్లించడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. గ్రామంలో మూడు లేఔట్లకు అనుమతులు ఇవ్వగా ప్రజా అవసరాల కోసం లే ఔట్లలో కేటాయించాల్సిన 10 శాతం భూమని కేటాయించలేదు. పంచాయతీ కార్యదర్శి వారి నుంచి డబ్బులు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సర్పంచ్​ భర్త, పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త పాండురంగ తెలిపారు. దీంతో ఆధారాలతో సహా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కి ఫిర్యాదు చేశానని వివరించారు. వీరి అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో పంచాయతీలో కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు పాండురంగ పవన్‌కి పంపిన సమాచారంలో పొందుపరిచారు. పంచాయతీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

వివాదాస్పద భూముల్లో వైఎస్సార్సీపీ నేతల లేఅవుట్లు- నోటీసులు జారీ - YSRCP Leaders Illegal Layouts

వర్క్​ చేయకుండా చేసినట్లు లెక్కలు చూపించి డబ్బులు చెల్లించడం. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​, సర్పంచ్ భర్త​ అకౌంట్​ల్లో అనేక రకాల నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. పంచాయతీలో వర్కర్లు లేకుండా ఉన్నట్లు చూపించి డబ్బులు తీసుకోవడం జరిగింది-పాండురంగ, సామాజిక కార్యకర్త

వైఎస్సార్​సీపీ మాజీ ఎమ్మెల్యే భూఅక్రమాలు - న్యాయం చేయాలని రైతులు వేడుకోలు - Ex YSRCP MLA Apparao Irregularities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.