చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలోని మూడవ అంతస్తులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అగ్ని ప్రమాదం కారణంగా సమావేశ మందిరంలో ని నాలుగు ఏసీలు, ఆరు కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ ను పరిశీలించడానికి కంప్యూటర్లు ల్యాప్ టాప్లను సమావేశ మందిరంలో భద్రపరిచారు. వాటి కేబుల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.25లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించింనట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి