చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామనడం కలకలం రేపింది. మండలంలోని మట్లివారి పల్లెకి చెందిన రైతు రమణ.. గ్రామంలోని తన భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. సర్వే చేసి నిజానిజాలు తేల్చాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక తమకు మరణమే శరణ్యం అంటూ.. పెట్రోల్ బాటిల్ తో నిరసన దిగాడు. రైతు నిరసనతో దిగివచ్చిన అధికారులు భూమి సర్వే జరిపి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: