చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల కుంభకోణం వెలుగుచూసింది. జిల్లా విజిలెన్స్ అధికారులు నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు. రైతుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి సీడ్ ఏజెన్సీలకు విత్తనాలు పంపిణీ చేస్తున్న దళారులను గుర్తించారు. 2017-18 రబీ సీజన్ కు నకిలీ వేరుశనగ విత్తనాలను వీరు పంపిణీ చేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన 13కోట్ల రాయితీని స్వాహా చేశారన్నారు. ఈ కుంభకోణంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎస్పీ రాధాకృష్ణ చెప్పారు.
ఇవీ చదవండి..