చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.....అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 73 కేసులుంటే శ్రీ కాళహస్తిలోనే 43 నమోదయ్యాయి. దీంతో లాక్ డౌన్ నిబంధనలను కఠినం చేశారు. నిత్యావసరాల కోసం ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా...వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ..అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నామంటున్న తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి కనకనరసారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి...చిత్తూరు జిల్లా వాసులు.. అజ్మీర్‌లో అవస్థలు!