చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన-భాకరాపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో తలకోన నుంచి అక్రమంగా తరలిస్తున్న 11 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.