చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగులు ఉన్న ఆ భారీ గుంపు.. కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే.. ఇవాళ గజరాజులు రోడ్డు దాటుతుండగా చూసి.. స్థానికులు వీడియో తీశారు. అటవీశాఖకు సమాచారమిచ్చారు. గ్రామానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇదీ చదవండి: