లాక్డౌన్లో భాగంగా.. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పురపాలక మాజీ చైర్మన్ నాగభూషణం, కమిషనర్ లోకేశ్వరవర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దోమల నివారణతో పాటు వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి.. కార్మికులకు అవసరమైన మాస్కులు అందించారు. భౌతిక దూరం పాటిస్తూ.. ఇళ్లల్లో నుంచి బయటకి రాకుండా ఉండాలని ప్రజలను కోరారు. పరిశుభ్రతను పాటించి కరోనాని అరికట్టాలన్నారు.
ఇదీ చదవండి: