కరోనా భయంతో పెంపుడు కుక్కలకు మాస్కులు కడుతున్నారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రజలు.. పెంపుడు జంతువులకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విధిగా మాస్కులు ధరించడం అలవాటుగా మార్చుకున్నారు శ్రీకాళహస్తి ప్రజలు. తమ పెంపుడు కుక్కలపైన ప్రతేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కుక్కలకు మాస్కులు కట్టి.. ఆ తర్వాతే బయటకు తీసుకొస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ పిల్లాడు ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటున్నాడు!