చిత్తూరు జిల్లాలో బుధవారం కొవిడ్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 20 మంది బాధితులు డిశ్ఛార్జ్ అయ్యారని అధికారులు ప్రకటించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8మంది, తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ఆరుగురు, స్విమ్స్ ఆసుపత్రి నుంచి మరో ఆరుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.
శ్రీకాళహస్తికి చెందిన 8 మంది, ఎర్రావారిపాలెంకు చెందిన ముగ్గురు, చిన్నగొట్టిగల్లు, తొట్టంబేడు, వరదయ్యపాలెం, తిరుపతి అర్బన్, బీఎన్ కండ్రిగ, ఏర్పేడు, పుత్తూరు, చంద్రగిరి, నిండ్రకు చెందిన ఒక్కొక్కరు డిశ్ఛార్జ్ అయ్యారు జిల్లాలో ఇప్పటివరకూ 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కోలుకున్న వారి సంఖ్య 68కి చేరుకుంది.
ఇదీచదవండి.