తిరుమలలో నిర్వహించిన ధన్వంతరి మహాయాగం నేటితో ముగిసింది. ఈ యాగంలో నాలుగు వేదాలు, సూర్య జపం, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేశారు. ప్రధాన కుంభ మంత్ర జలాన్ని ధన్వంతరి స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ తీర్థ జలాన్ని తిరుమలలోని జలాశయంలో కలుపుతామని నిర్వాహకులు అన్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుందని వివరించారు.
శ్రీవారి ఆలయంతో పాటు తితిదే అనుభంద ఆలయాల్లో కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తిరుమల ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుపతిలో ఆకలి ఇబ్బందులు లేకుండా నిత్యం 30 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే 50 వేల మందికి పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుచానురులోని పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకునే ఏర్పాట్లు చేశామన్నారు వెల్లడించారు.
ఇదీ చదవండి.