ETV Bharat / state

పుష్పపల్లకిపై కలికిరి ఎల్లమ్మ విహారం - చిత్తూరు జిల్లా కలికిరి

చిత్తూరు జిల్లా కలికిరిలో.. ఎల్లమ్మ తల్లి పుష్పపల్లకి విహారం వైభవంగా జరిగింది.

Yellamma
author img

By

Published : Jul 23, 2019, 4:26 PM IST

పుష్పపల్లకిపై కలికిరి ఎల్లమ్మ విహారం

చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు.. పుష్పవాహనంపై ఊరేగారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిపై మంగళాంబికాదేవిగా ఆశీనురాలైన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గ్రామ వీధుల్లో.. పల్లకిని ఊరేగించారు.

పుష్పపల్లకిపై కలికిరి ఎల్లమ్మ విహారం

చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు.. పుష్పవాహనంపై ఊరేగారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిపై మంగళాంబికాదేవిగా ఆశీనురాలైన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గ్రామ వీధుల్లో.. పల్లకిని ఊరేగించారు.

Intro:దయనియ స్దితిBody:*పసిబిడ్డలకు.. పెన్నమే పెద్దదిక్కు!*

*యాంకర్ వాయిస్* : ఇక్కడ కనిపిస్తున్న దంపతుల పేర్లు శీనయ్య , కృష్ణవేణి గత నాలుగేళ్లుగా పెన్నా నది ఓడ్డున చిన్న పూరిపాక వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవనాధారం కేవలం చేపలు పట్టడం.ఈ తరుణంలో సరగ్గా తొమ్మిది రోజుల క్రితం వీరికి కవల పిల్లలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి పెన్నామ్మ తల్లి వీరికి పెద్దదిక్కుగా మారింది.. పసిబిడ్డలకు పురిటి నీళ్లు పోసినప్పటి నుంచి, బిడ్డల ఆలనాపాలనా వరకు అన్ని పెన్నానది ఒడిలోనే. ఊరికి దూరంగా ఉంటారు ఏకంతంగా ఉంటారు.ఎండొచ్చినా, వానొచ్చినా వర్షానికి తడుస్తూ వాళ్లు పడే బాధలు వర్ణనాతీతం. ఎవరైనా పసిబిడ్డలను పొద్దుపొడిస్తే కనీసం ఇంటిబయటకు కూడా తీసుకురారు.. అలాంటిది రోజుల బిడ్డలను తీసుకొని పగలనక రేయనక నది గట్టు పైనే కాలం వెళ్లదీస్తున్నారు. చందమామా పైన అడుగు పెడుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఇంకా వున్నారంటే ఈ తప్పు ఎవరిది..? నదికి వరదొస్తే ఇక్కడ పరిస్థితి భయానకంగా వుంటుంది. ఈ దంపతులు నాలుగు సంవత్సరాల నుండి జీవిస్తున్న దీనజీవనంపై కథనం.....

*వాయిస్ ఓవర్* : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుట్టుపల్లి గ్రామానికి నాలుగేళ్ళ క్రితం వచ్చారు ఆ‌ దంపతులు. వారికి దిక్కుమొక్కు ఎవరులేరు. వచ్చిక కొన్ని రోజులకు గ్రామంలోనే ఉంటూ గ్రామస్ధులు ఇచ్చిన ఆహారం తింటూ స్కూల్ లో తలదాచుకునేవారు. కొన్నిరోజుల తర్వాత గ్రామస్ధుల ఆదరణ లేకపోవడంతో పెన్నా నదితీరంలో ఒక చిన్న పూరిక పాకవేసుకొని జీవనం చేసుకుంటున్నారు.వీరి జీవనాధారం కేవలం చేపలు పట్టడం మాత్రమే. చేపలు పడని రోజులో పస్తులే. ఈ తరుణంలో సరిగ్గా పదిరోజుల క్రితం వీరికి మగ కవల పిల్లలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి పెన్నామ్మ తల్లి వీరికి పెద్దదిక్కుగా మారింది.. పసిబిడ్డలకు పురిటి నీళ్లు పోసినప్పటి నుంచి, బిడ్డల ఆలనాపాలనా వరకు అన్ని పెన్నానది ఒడిలోనే. వీరికి ఇప్పటి వరకు కనీసం ఆధార్ కార్డ్ కూడా లేదంటే ఆశ్చర్యపోక మానదు. దీంతో బాలింతకు అందాల్సిన పౌష్టికాహారం కూడా ఇవ్వడం లేదు, రేషన్ సరుకులు రావు, ప్రభుత్వ పథకాలు అందవు, కనీసం ఇల్లు కూడా లేదు. ఈమె డెలివరీ అయింది మాత్రం ఆత్మకూరు సర్వజన ఆసుపత్రిలో అయితే ఈ ఆసుపత్రి నుండి కూడా వీరికి ఇప్పటి వరకు ప్రభుత్వం అందించే కనీస సహాయం కూడా అందలేదు. దయనీయమైన వీరి దీనగాధ విని గ్రామస్థులు పాత బట్టలు, ఆహార పదార్థాలు సాయమందిస్తున్నారు. ఇంత జరుగుతున్న మన అధికారులకు మాత్రం వీరి గురించి అస్సలు సమాచారమే లేదు. ఇకనైనా అధికారులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్పందించి ఇలాంటి వారికి మీకు తోచిన సాయమంది చాల్సిందిగా మనవి. ప్రార్ధంచే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.

బైట్స్ : శీనయ్య (గిరిజనుడు)Conclusion:కిట్ నెం 698 నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.