తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలు బారులు తీరాయి. తనిఖీలకు సమయం పడుతుండటంతో.. గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అధిక సంఖ్యలో భక్తులు సొంత వాహనాల్లో వస్తుండటం, వాటన్నింటిని తనిఖీలు చేయడానికి ఆలస్యమవుతోంది. ఫలితంగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
తిరుమల కనుమదారిలో కారు దగ్ధం..
తిరుమల కనుమదారిలో కారు దగ్ధమైంది. కర్నూలుకు చెందిన మహేశ్వర రెడ్డి, సుజాత దంపతులు కారులో కొండపైకి ప్రయాణిస్తున్న సమయంలో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దంపతులు కారును పక్కకు ఆపి దిగిపోయారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి: tirumala : తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి