చిత్తూరు జిల్లా పుత్తూరు మార్కెట్ యార్డ్‌లో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వ్యాపారులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని తెలియజేశారు. సారాను అక్రమంగా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. వ్యాపారులందరికీ మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో మరో 21 మందికి కరోనా.. 132కు చేరిన పాజిటివ్ కేసులు