Deputy CM visited kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
ఇటీవల ఆలయంలో ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన బంగారు పట్టీని తన ఇంటికి తీసుకువెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆలయానికి అందజేసిన అర్చకుడిపై చర్యలు తీసుకోవడానికి కమిటీ వేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి.. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని.. ఆ వివరాలను మీడియాకు తెలియజేస్తామని మంత్రి అన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్యమైన దేవుడని.. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే దేవుడు క్షమించడని చెబుతూ.. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను త్వరగా అమలుచేసి.. అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: