ETV Bharat / state

ఖననానికి లేని చోటు.. 2 రోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ - తిమ్మరాజుపురంలో శవం అంతక్రియల వార్తలు

ఎంత బతికినా చివరకు చేరేది ఆరడుగుల నేలలోకే.. సొంత భూములు ఉన్నవారు తమ స్థలాల్లోనే అయినవాళ్లకు అంత్యక్రియలు చేస్తారు. భూములు లేనివాళ్లు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ.. ఊళ్లో అసలు శ్మశానమే లేకపోతే? చనిపోయినవాళ్లకు అంత్యక్రియలు చేసే చోటంటూ దొరక్కపోతే.. ఆ బాధితుల బాధ.. ఇదిగో ఇలాగే వర్ణనాతీతంగా ఉంటుంది.

dead body waiting for funeral due to Cemetery problem at thimmarajapuram in chittore district
author img

By

Published : Nov 20, 2019, 3:04 PM IST

Updated : Nov 20, 2019, 5:18 PM IST

చిత్తూరు జిల్లా వి. కోట మండలం తిమ్మరాజుపురం గ్రామంలో శ్మశానం లేక ఓ పెద్దావిడ మృతదేహం 2 రోజులనుంచి అంత్యక్రియలకు నోచుకోలేదు. ఎనభై ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా... ఆమెను పూడ్చేందుకు స్థలం లేని కారణంగా.. బంధువులు భూమి కోసం పోరాడుతున్నారు. వాగు పక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశానానికి అధికారులు కేటాయించారు. అదే భూమిని సాగు చేసుకుంటున్న ఓ వర్గంవారు.. శ్మశానానికి ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ కారణంగా.. సమస్య తీవ్రతరమైంది.

ఖననానికి చోటులేక..రెండ్రోజులనుంచి శవం నిరీక్షణ

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్వే చేశారు. ఆ భూమి శ్మశానానిదే అని తేల్చారు. అయినా... ఇవ్వబోమంటూ సాగు చేసుకుంటున్నవారు వాగ్వాదానికి దిగారు. చివరికి ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఫలితంగా.. తిమ్మరాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లనుంచి ఎవరైనా మృతి చెందితే వారి పొలాల్లోనే ఖననం చేసుకునేవారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడమే సమస్యకు కారణమైంది. భూమిలేని పేదలు చనిపోతే.. వారికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలో చెప్పాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడిన పరిస్థితుల్లో శ్మశాన స్థలం కోసం ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి

చంద్రగిరిలో ఇరువర్గాల ఘర్షణ... యువకునిపై కత్తితో దాడి

Intro:ap_tpt_51_19_dead_body_waiting_for_funeral_avb_ap10105

అంత్యక్రియల కోసం మృతదేహం ఎదురుచూపులుBody:చిత్తూరు జిల్లా వి కోట మండలం తిమ్మరాజు పురం గ్రామంలో శ్మశానం కోసం స్థలం లేకపోవడంతో వెంకటమ్మ అనే ఎనభై ఏళ్ల వృద్ధురాలి మృతదేహం నిరీక్షణ.

వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా ఆమెను పూడ్చేందుకు శ్మశాన స్థలం లేకపోవడంతో బంధువులు భూమి కోసం పోరాటం చేస్తున్నారు.

వాగుపక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశాన స్థలంగా మార్పు చేసినా దానిని సాగు చేసుకుంటున్న దళితులు ఆ భూమిని ఇవ్వమంటూ భీష్మించి కూర్చోవడంతో సమస్య తీవ్రతరమైంది.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్వే చేసి శ్మశాన స్థలాన్ని తేల్చిన ఆభూమిని ఇవ్వమంటూ దళితులు.. ఇచ్చి తీరాల్సిందేనంటూ బోయలు ..పట్టుపట్టడంతో సమస్య జటిలమైంది.

దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో తిమ రాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇన్నేళ్లు ఎవరి ఇంట్లో అయినా ఎవరైనా మృతి చెందితే వారి వారి పొలాల్లోనే ఖననం చేసుకునే వారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది.

భూమిలేని పేదలను ఎక్కడ పాతి పెట్టాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడడంతో శ్మశాన స్థలం కోసం ఆందోళనలకు దిగారు..

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
Last Updated : Nov 20, 2019, 5:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.