తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి నకిలీ టికెట్లు విక్రయించి దళారులు డబ్బులు దండుకుంటున్నారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన 14 మంది భక్తులకు ఒక్కో టికెట్ 900 రూపాయల చొప్పున 14 నకిలీ టికెట్లను విక్రయించారు.
అవి నకిలీ టికెట్లు అని తెలియని భక్తులు యథావిధిగా దర్శనానికి వెళ్లగా తితిదే అధికారులు అసలు విషయాన్ని గుర్తించారు. తితిదే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు.. మోసాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. 20 సంవత్సరాలుగా తిరుమల - తిరుపతి మధ్య అద్దె వాహనాలు నిర్వహిస్తున్న నవనీతకృష్ణ, వేణుగోపాల్ అనే వ్యక్తులే మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:
JANASENA: నిరుద్యోగుల సమస్యలపై జనసేన పోరాటం.. నేతల గృహ నిర్భంధం