చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ప్రాంతానికి మందుబాబులు వరుస కట్టారు. గత 3 రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడంతో రాష్ట్ర సరహద్దులో ఉన్న మద్యం దుకాణాలు కొనేవారు లేక వెలవెల పోయాయి. తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో మద్యం దుకాణాలను మూసేశారు.
తమిళనాడులో మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు సరిహద్దు ప్రాంతం వైపు బారులు తీరారు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానిక పోలీసులు మద్యం కోసం బారులు తీరిన వారిని దుకాణానికి కిలోమీటర్ ముందే ఆపి మాస్కులు ధరించి, ఎండ వేడి నుండి రక్షణ పొందడానికి గొడుగులు కలిగిన వారిని మాత్రమే అనుమతించారు.
ఇదీ చూడండి గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన