అంతరిక్షం, సముద్రం సహా అన్నింటినీ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రైవేటీకరించేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ మేరకు తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంటే వైకాపా, తెదేపా, జనసేన మద్దతునిస్తున్నాయన్నారు. ధార్మిక సంస్థ తితిదే నుంచి రూ. 120 కోట్లను జీఎస్టీ పేరుతో కేంద్రం వసూలు చేస్తుంటే ఎవరూ ప్రశ్నించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని భాజపా చూస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: