తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద సీపీఐ ఆందోళన చేపట్టింది. నిన్నటి ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆందోళన చేపట్టిన సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి రుయా వద్ద ఆందోళనకు వెళ్తుండగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. నగరి సమీపంలో నారాయణను అరెస్టు చేసి తన స్వగ్రామం ఐనంబాకం తరలించారు.
ఇదీ చదవండి: 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం