రైతులకు పరిహారం విషయంలో న్యాయం చేశాకే ప్రభుత్వం వారి నుంచి భూమిని సేకరించాలని సీపీఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల్లో జాతీయ రహదారి ఏర్పాటులో రైతులకు ముందుగా న్యాయం చేయాలన్నారు. ఇందుకోసం నరసింహ రాజపురం, పద్మాపురం గ్రామాల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించారు.
జాతీయ రహదారి ఏర్పాటులో భూమిని కోల్పోతున్న సర్వే నెంబర్ 716/బి కి సంబంధించిన రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులను సంతృప్తి పరిచేవిధంగా చర్యలు చేపట్టిన తరువాతే అవసరమైన భూ సేకరణ జరపాలని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ నారాయణ ముందుకు సాగారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:
RIDE: రూ.69 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన శ్రీపాద ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్