చిత్తూరు-తల్చూరు హైవేకు సాగు భూములు సేకరిస్తున్నారని.. రైతుల దగ్గర భూమి తీసుకుని ల్యాండ్ మాఫియా చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 80 శాతం రైతులు అంగీకరిస్తేనే భూమి తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిసి చేస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది.. తెలియకుండా కిందిస్థాయి అధికారులు చేస్తే వారిపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సంతృప్తి పరిచాకే భూసేకరణ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
'బలవంతపు భూసేకరణ వద్దు, రైతులు అంగీకరిస్తేనే తీసుకోవాలి. మార్కెట్ విలువ ఇస్తామంటూ బలవంతంగా సంతకాలు సేకరించారు. సంతకం చేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు. భూసేకరణ గురించి గడ్కరీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు వివరిస్తాం' -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా.. ఈ నెల 15 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 'ఉక్కు'ను ప్రైవేటుపరం చేస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: