ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కరోనా టీకా డ్రైరన్

చిత్తూరు జిల్లాలో రెండో విడత నిర్వహించిన కరోనా టీకా డ్రైరన్.. విజయవంతమైంది. 145 కేంద్రాల్లో నిర్వహించిన డ్రైరన్​లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Jan 9, 2021, 7:25 AM IST

వైద్యులతో మాట్లాడుతున్న సంయుక్త కలెక్టర్

కరోనా టీకా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కొవిన్ సాప్ట్​వేర్ పరిశీలన కోసం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండో విడత డ్రైరన్ విజయవంతమైంది. కరోనా టీకా కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నిమమించినట్లు సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం తెలిపారు. టీకాలను నిల్వ చేయడానికి అవసరమైన రిఫ్రిజిరేటర్, ఐస్​ప్యాకులను అందుబాటులో ఉంచామని చెప్పారు.

తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 వేల మందిని గుర్తించామని వారికి సంబంధించిన సమాచారాన్ని కొవిన్ సాప్ట్​వేర్​లో పొందుపరిచామని వివరించారు. కరోనా టీకా వేయాల్సిన వారికి సంక్షిప్త సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:

బోరుబావి నుంచి ఎగిసిపడుతున్న పాతాళగంగ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.