చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ నిర్వహించారు. నగరపాలక సంస్ధ పరిధిలోని ఆరోగ్య కేంద్రం, తిరుపతి స్విమ్స్తో పాటు, మదనపల్లిలోని చంద్రశేఖర్ నర్సింగ్హోమ్లలో డ్రైరన్ చేపట్టారు. టీకాను పంపిణీ చేసే సమయంలో అనుసరించాల్సిన విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించే లక్ష్యంతో డ్రైరన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డ్రైరన్ కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య ఇతర అధికారులు పరిశీలించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న 31,296 వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మొదటి విడతగా వ్యాక్సిన్ వేయనున్నట్లు స్పష్టం చేశారు
ఇదీ చదవండి: 'చిత్తూరు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కరోనా డ్రై రన్'