చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినిస్తామన్నారు. నియోజకవర్గంలో 5 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు, 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో 100, నారావారిపల్లి సీహెచ్‌సీలో 50 ఆక్సిజన్ పడకలు ఏర్పాటుకు రూ. 25 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయన్నారు.
ఇదీచదవండి: ఆక్సిజన్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు.. ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు