కొవిడ్-19 అనుమానితులను పరీక్షల అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 11 మందిని డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ భారతి తెలిపారు. జిల్లా వాసులు 11 మందికి నెగటివ్ రిపోర్ట్ రావటంతో పంపించామని ఆమె తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిలో పిచ్చాటూరు 4, సత్యవేడు 1, నాగలాపురం 2, నగరి 1, శ్రీకాళహస్తి 1, వి.కోట 1, తిరుపతి 1 ఉన్నారని ఆమె తెలిపారు
ఇదీ చూడండి రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి