కోవాగ్జిన్ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన తితిదే ఉద్యోగులకు మంగళ, బుధ వారాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ వేసుకోవలసిన వారి జాబితాను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. మొదటి డోస్ వేసుకున్న రోజును పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ జాబితా సిద్ధం చేశారు. తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న తితిదే ఉద్యోగులకు మున్సిపల్ సిబ్బంది నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందుతుందని తితిదే తెలిపింది. సమాచారం వచ్చిన వారు కంచి మఠం సమీపంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 40వ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందాలని కోరింది. టీకా వేసుకోవాల్సిన గడువును ప్రాధాన్యత క్రమంలో లెక్కించి మున్సిపల్ అధికారులు ఈ టోకెన్లు మంజూరు చేస్తున్నారని . అధికారులు అన్నారు. ఉద్యోగులు ఈ విషయం గుర్తించి రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని తితిదే ప్రకటన విడుదల చేసింది.
తితిదే ఉద్యోగులకు కోవాగ్జిన్ రెండోడోస్ - Covaxine Second Dose for ttd Employees
తితిదే ఉద్యోగులకు మంగళ, బుధ వారాల్లో కోవాగ్జిన్ రెండోడోస్ టీకాను వేయనున్నారు. కంచి మఠం సమీపంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 40వ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందాలని తితిదే కోరింది.