వైకాపా ప్రభుత్వం బీసీలకు ప్రతి రంగంలోనూ అన్యాయం చేస్తూ...కార్పొరేషన్ల ఛైర్మన్ పదవుల పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ విమర్శించారు. గత ప్రభుత్వం తితిదే ఛైర్మన్, తుడా ఛైర్మన్ ఇలా కీలక పదవులను బీసీలకు కేటాయించి అసలైన బీసీ పక్షపాతిగా వ్యవహరించిందన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కావల్సినంత మంది సలహాదార్లను పెట్టుకొని..మంత్రివర్గానికే పని లేకుండా చేసిందంటూ ఎద్దేవా చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో... నియమించిన ఛైర్మన్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం బీసీలకు ఏదో చేశామని చెప్పుకోవటానికే కార్పొరేషన్ల నాటకానికి వైకాపా తెరతీసిందంటూ నరసింహ యాదవ్ మండిపడ్డారు.
ఇదీచదవండి