ETV Bharat / state

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన కొవిడ్ టీకా పంపిణీ - చిత్తూరులో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం న్యూస్

కరోనా టీకా పంపిణీ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. 29 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. జిల్లాకు చేరుకున్న 41,500 డోసుల టీకాలను 37,703 మందికి అందించేందుకు అధికారులు జాబితాను సిద్ధం చేశారు. తొలి విడతలో రోజుకు 2,900 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేశారు.

corona vaccine distribution program in Chittoor
తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం..
author img

By

Published : Jan 16, 2021, 10:43 PM IST

ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన కోవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. తొలి విడతలో 29 కొవిడ్ టీకా కేంద్రాల ద్వారా రోజుకు 2900 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చేరుకున్న 41,500 డోసుల టీకాలను 37,703 మందికి అందించేందుకు అధికారులు జాబితాను సిద్ధం చేశారు.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో..

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన ఆరోగ్య శాఖ సిబ్బంది నిజమైన దేవుళ్లని ఉప ముఖ్యమంత్రి అన్నారు. టీకా వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. కరోనా వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. మొదట విడతలో వైద్య సిబ్బంది, రెండో విడతలో పోలీసులకు వ్యాక్సిన్​ను అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన వైద్యులు.. అదే స్పూర్తితో ప్రజలందరికీ టీకా అందేవరకు పనిచేయాలని కోరారు. జిల్లాకు 41,500 డోసుల కరోనా టీకాలు వచ్చాయని అన్నారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం..

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. మొదటిగా స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న హైమావతికి వైద్యులు టీకాను వేసి.. పరిశీలనలో ఉంచారు. రక్తపోటు, అలర్జీ వంటి అంశాలను పరిశీలించారు. వైద్యుల సూచనల మేరకు.. నలభై సంవత్సరాలు పైబడిన, ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారికి వ్యాక్సిన్​ను అందించేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ టీకాను మొదటి విడతగా వైద్య సిబ్బందికి, అనంతరం రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు వేయనున్నామని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రెండో దశ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న సేవలను గుర్తించాలని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తిలో..

శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యసిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆసుపత్రిలోని మహిళా సిబ్బందికి తొలి టీకా వేసిన వైద్యులు.. అనంతరం.. మిగిలిన సిబ్బందికి వ్యాక్సిన్​ను అందించారు.

శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో..

శాంతిపురం, గుడుపల్లె మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిదులు ప్రారంభించారు. మొదటగా వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులకు కరోనా టీకాలను అందించారు.

మదనపల్లిలో ..

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి టీకాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని మదనపల్లి ఎమ్మెల్యే నమాజ్ భాష ప్రారంభించారు. మొదటి రోజు వంద మందికి వ్యాక్సిన్​ వేశారు.

పుత్తూరులో..

పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియను పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి మురళీధర్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని మురళీధర్ అన్నారు. ప్రభుత్వ అప్రమత్తతో మరణాల సంఖ్య చాలావరకు తగ్గిందని పేర్కొన్నారు. తొమ్మిది నెలల కాలంలోనే కరోనాకు వ్యాక్సిన్​ను కనిపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కృషి ఎంతగానో ఉందని చెప్పారు.

కొన్నిచోట్ల మొరాయింపు..

తొలిరోజు కరోనా టీకా పంపిణీ కార్యక్రమం చిత్తూరులో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధాని ప్రసంగం ముగిశాక.. టీకా వేయడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్ని ప్రాంతాల్లో మొరాయించింది. పుత్తూరులో మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాలేదు.

రుయాలో గందరగోళం..

రుయాలో కరోనా టీకాను తీసుకునేందుకు సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపలేదు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వ్యక్తులు రాకపోవడంతో.. ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఈ క్రమంలో మెటర్నిటీ ఆసుపత్రిలో పనిచేసే రాధాకు వ్యాక్సిన్ తీసుకునేందుకు రావాల్సిందిగా కోరారు. తీరా టీకా తీసుకునే సమయంలో జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో వెంటనే ఆమెకు వ్యాక్సినేషన్​ను నిలిపివేశారు.

ఎంతో ఆనందగా ఉంది..

తొలిరోజు వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది టీకా వేసుకున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టీకా అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని వ్యాక్సిన్ వేసుకున్న వైద్యులు తెలిపారు. టీకా ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఫిబ్రవరి 7న మదనపల్లికి రానున్న రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.