చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లను జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య సందర్శించారు. వైద్య సిబ్బంది 80వేల మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడతలో వారందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. జిల్లాకు 40వేల డోసులు వచ్చాయని వెల్లడించారు. దశలవారీగా వాక్సినేషన్ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు లేవని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరువాత పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు టీకా అందుతుందని వివరించారు. అనంతరం 50ఏళ్ల పైబడి వృద్ధులకు ఇస్తామన్నారు. గర్భిణీలు, 18 ఏళ్లలోపు వారికి ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరగలేదని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత వారికి వాక్సినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతికి చంద్రబాబు సంతాపం