ETV Bharat / state

'వైద్యుల నిర్లక్ష్యమే.. నా భర్త ప్రాణం తీసింది'

కరోనా సోకి శ్వాస అందక అల్లాడుతున్న భర్తను తీసుకొని ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసిందామె. ఏ ఒక్కరూ స్పందించలేదు.. ఈ ఆసుపత్రి కాదు.. ఆ ఆసుపత్రికి తీసుకువెళ్లండి అంటూ సమాధానం.. అక్కడకి.. ఇక్కడకి అంటూ తిప్పారే కానీ ఏ ఒక్కరూ ఆ బాధితుడిని చేర్చుకోలేదు. చివరికి ఆసుపత్రిలోనే ప్రాణాలు పోయాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త ప్రాణాలు పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తోందా భార్య.

corona patient died
వైద్యుల నిర్లక్ష్యంకు కరోనా బాధితుడు మృతి
author img

By

Published : Aug 11, 2020, 11:09 PM IST

వైద్యుల నిర్లక్ష్యంకు కరోనా బాధితుడు మృతి

తన భర్తను ఆసుపత్రిలో చేర్చుకొని ఉంటే ప్రాణాలతో ఉండేవాడంటూ చిత్తూరు జిల్లా తిరుపతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఓ మహిళ కన్నీరుమున్నీరైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తిరుపతి ఎస్టీవీ నగర్​కు చెందిన నరేంద్ర అనారోగ్యంతో ఈ నెల 3న కరోనా పరీక్షలు చేయించుకోగా.. 5న కొవిడ్ పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్​లో ఉండగా.. ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయాయనీ.. వెంటనే 108 అంబులెన్స్ సాయంతో రుయాకు తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.

అక్కడ వెంటిలేటర్లు లేకపోవటంతో రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి పద్మావతి ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ చేర్పించుకోలేదని తెలిపారు. దీంతో అక్కడ నుంచి డీబీఆర్, రమాదేవి, సంకల్ప, లోటస్ తదితర ఆసుపత్రుల చుట్టూ తిప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా రుయా ఆసుపత్రిలో వెంటిలేటర్ ఉందని సమాచారం రావటంతో.. ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికి ప్రాణం పోయిందంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వైద్యలు నిర్లక్ష్యంగా ఉండటంతోనే తన భర్త చనిపోయాడని మృతుడు భార్య కన్నీమున్నీరుగా విలపించింది.

ఇదీ చదవండి:

ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలెక్టర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.