చిత్తూరు జిల్లాలో 187 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులకు కరోనా సోకింది. గడచిన వారం రోజులుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో 187 మంది ఉపాధ్యాయులకు, 18 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయ్యింది. కరోనా బాధిత ఉపాధ్యాయులకు విద్యా శాఖ ఉన్నతాధికారులు 14 రోజుల సెలవు ఇస్తుండగా, విద్యార్థులను పాఠశాలకు రావొద్దని సూచిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు చేయిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి దెబ్బకు ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు.
కొన్ని చోట్ల పునఃప్రారంభించినా కరోనా భయంతో పిల్లల్ని పాఠశాలకు పంపాలా.. వద్దా అన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఆరోగ్య భద్రతా చర్యలు కొరవడిన పాఠశాలల్లోఒకవైపు తమ ఆరోగ్యాలను కాచుకుంటూనే.. విద్యార్థుల ఆరోగ్యాలకు పూచి పడాల్సి రావడం ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. మొదట్లో విద్యార్థులందరికీ పరీక్షలు చేయిస్తామని చెప్పిన విద్యాశాఖాధికారులు, ఇప్పుడు కరోనా లక్షణాలున్న వారికే చేస్తుండటం గమనార్హం.
ఇదీ చదవండి: