ETV Bharat / state

'యాత్రికులు లేక వ్యాపారాల్లేవు... అద్దె మొత్తం ఎలా చెల్లించాలి?'

నిత్యం వేలాది బస్సుల రాకపోకలు.. యాత్రికుల హడావిడి....! గతంలో తిరుపతి బస్ స్టాండ్ ‌లో ఈ దృశ్యాలు సర్వసాధారణమే.! లాక్‌డౌన్‌ తర్వాత పరిమితంగానైనా శ్రీవారి దర్శనాలకు అనుమతిచ్చినా.. పూర్వవైభవం సంతరించుకోవడం లేదు. యాత్రికులు అంతగా రాక వ్యాపారాల్లేవని దుకాణదారులు నిరాశలో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లోనూ అద్దె మొత్తం చెల్లించాలని ఆర్టీసీ ఆదేశించడం.. వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

tirupathi busstand
'యాత్రికులు లేక వ్యాపారాల్లేవు... అద్దె మొత్తం ఎలా చెల్లించాలి'
author img

By

Published : Jun 26, 2020, 4:33 AM IST

Updated : Jun 26, 2020, 11:20 AM IST

వచ్చిపోయే భక్తులతో... ఇసుకేస్తే రాలనంతగా తిరుపతి బస్టాండ్ కళకళాడుతుండేది. ఆ ప్రాంగణంలో ఉండే 175 మంది దుకాణదారులు... ఆ సందడి ఆధారంగానే జీవనం సాగించేవారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. దాదాపు రెండున్నర నెలలు బస్టాండ్‌ మూతపడటంతో... వారి ఆదాయానికి గండిపడింది. ఆంక్షల సడలింపుల తర్వాత కూడా వ్యాపారాల్లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని... వెంటనే అద్దెలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు ఆదేశించటంతో లబోదిబోమంటున్నారు.

జీతాలే ఇవ్వలేని దుస్థితి...

తిరుపతిలోని శ్రీనివాసం, శ్రీహరి, ఏడుకొండలు బస్టాండ్‌లో ఉన్న 175 దుకాణాల వద్ద కనిష్ఠంగా 15వేల నుంచి గరిష్ఠంగా రెండున్నర లక్షల అద్దెను ఆర్టీసీ వసూలు చేస్తుంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా బస్సు సర్వీసులు, యాత్రికుల రాకపోకలు పెద్ద ఎత్తున లేవని.... రోజుకు 2వేలు సంపాదించడమే గగనమైపోతోందని దుకాణదారులు వాపోతున్నారు. పనివారికి జీతాలివ్వడానికే కష్టపడుతున్న తరుణంలో అద్దె చెల్లించాలనడం సమంజసం కాదంటున్నారు.

వదులుకుందామనుకున్నా...

కొంతమంది తమ దుకాణాలను వదులుకునేందుకు సిద్ధపడినా... నిబంధనల ప్రకారం 3 నెలల ముందే సమాచారమివ్వాలన్న అగ్రిమెంట్లు అందుకు అడ్డువస్తున్నాయంటున్నారు. పైగా అద్దెలు చెల్లించని దుకాణాల నుంచి వడ్డీలు వసూలు చేసే సంప్రదాయం సైతం ఉండటం... తమకు కష్టంగా మారిందంటున్నారు. దుకాణదారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తిరుపతి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలను గుర్తించి అద్దెల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని దుకాణదారులు వాపోతున్నారు.

'యాత్రికులు లేక వ్యాపారాల్లేవు... అద్దె మొత్తం ఎలా చెల్లించాలి'

ఇవీ చూడండి-కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం

Last Updated : Jun 26, 2020, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.